Paid2YouTube.com

Wednesday, 14 December 2016

Why-What-How---కోతి నుంచి మానవుడు ఉద్భవిస్తే , మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు ?

అ)     మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దాని అర్థం కోతులాంటి జీవులు పరిమాణం చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే . ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకల మారడం లాంటి జీవిత చక్రం కాదు . మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి కాని కాండం అంతరించి పోదు కదా ? జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం , కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్ళు తినడం , కొన్ని పరికరాలను సులువుగా వాడగల్గడం లాటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిమాణంలో క్రమేనా అలవడ్డాయి . అవే చింపాంజీలు , ఉరాన్గుటాన్ లు , గోర్రిల్లాలు లాంటి తోక లేని కోతి గ మారాయి . వాటి నుంచి క్రమేనా మానవజాతి పరిమాణం చెందింది . మనకు తల్లితండ్రుల పోలికలు ఉన్నా వాళ్ళు కుడా మనతోనే ఉంటారు కదా , అయితే తల్లితండ్రుల కన్నా మనం పరిమానాత్మకంగా కొంత మెర్రుగా ఉంటాము , ఏ జీవ జాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి నాలుగు కాలాల పాటు నిలదోక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది , తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి , శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పినట్లు ప్రక్రుతివరణమే జాతుల ఆవిర్భావానికి ఆస్కారం కలిగించింది.
Follow us for more info
Written by | k Ravi Kumar| Kurnool

No comments:

Post a Comment