కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ సమీపంలోని చాలక్కుడికి చెందిన కేథలిక్ పూజారి ప్రాన్సిస్ రాబిన్ వడక్కుం చెరి సెయింట్ సెబాస్టియన్ చ ర్చిలో ఫాస్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రాన్సిస్ ఐజేఎం హయ్యర్ సెకండరీ స్కూలులో ఇంటరు చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకొని పలుసార్లు అత్యాచారం చేశాడు.
కీచకుడైన పాస్టర్ అమ్మాయి తండ్రికి డబ్బులిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఛైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఛైల్డ్ లైన్‌కు లేఖ రాయడంతో ఈ బండారం బయటకు వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అత్యాచారం బారిన పడిన బాధిత బాలిక గర్భవతి అయి సోమవారం రాత్రి ఆసుపత్రిలో అమ్మాయికి జన్మనిచ్చింది.
మొదట్లో తన సొంత తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆ విద్యార్థిని చెప్పింది. కానీ, ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చర్చి పాస్టర్ అని, దాంతోపాటు ఆమె చదువుతున్న పాఠశాలకు మేనేజర్‌గా కూడా ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. దీంతో అమ్మాయి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి అత్యాచారం జరిపిన రాబిన్ వడక్కుం చెరిని అరెస్టు చేసి, నవజాత శిశువును వైతిరిలోని ప్రైవేటు అనాథ శరణాలయానికి తరలించారు.
Source by Deccan report
Source by Deccan report

No comments:
Post a Comment