Paid2YouTube.com

Wednesday, 4 January 2017

మీకు SBI బ్యాంక్ లో అకౌంట్ ఉందా…… ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే ……

బ్యాంక్‌ లో అకౌంట్ ఉన్నవాళ్ళను అందరినీ  ఇప్పుడు భయపెడుతున్నది సైబర్‌ నేరగాళ్లు. ఏ ఖాతా నుంచి ఎప్పుడు ఎంతమొత్తం మాయమవుతుందో తెలియని పరిస్థితి. బ్యాంకర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో ఖాతా వివరాలు, పిన్ నంబర్‌ తెలుసుకుని వీరు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు కూడా అంతుచిక్కని స్థాయిలో జరుగుతున్న ఈ నేరాల వల్ల వేల నుంచి లక్షల్లో నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. సైబర్‌ నేరాలకు పరిష్కారం ‘ఎస్‌బీఐ క్విక్‌’ పరిష్కారం అంటోంది స్టేట్‌ బ్యాంక్‌ యాజమాన్యం. ఇందుకు కావాల్సిందల్లా స్మార్ట్‌ ఫోన్, రిజిస్ట్రర్డ్‌ ఫోన్ నంబర్‌ మాత్రమే అని చెబుతోంది.
నగదు రహిత లావాదేవీలు అనగానే ఎక్కువ మంది వినియోగించేవి డెబిట్‌ కార్డులే. ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్దా ఏదో ఒక బ్యాంక్‌ డెబిట్‌ కార్డు దర్శనమిస్తుంది. డెబిట్‌ కార్డులను వెంటాడే ప్రధాన సమస్య సైబర్‌ మోసం. ఈ పరిస్థితుల్లో డెబిట్‌ కార్డు దుర్వినియోగం ఆపడం ఎలా? అన్న చర్చమొదలైంది. ఇందుకు తమ ప్రత్యేక యాప్‌ పరిష్కారం అంటోంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. తమ యాప్‌ ద్వారా మీ కార్డు వినియోగాన్ని మీరే నియంత్రించుకునే సదుపాయం, పిన్ లాక్‌ సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేస్తోంది. దీనివల్ల పొరపాటున మీ డెబిట్‌ కార్డు పిన్ నంబర్‌ ఎవరికైనా తెలిసినా కార్డు వినియోగించలేరని, అందువల్ల మన నగదుకు పూర్తి భరోసా ఉంటుందని చెబుతున్నారు.
bis
అసలు ఈ యాప్‌ ఏమిటి? ఎలా వినియోగించాలి…….?
బ్యాంకు ఖాతాదారుడికి డెబిట్‌ కార్డు అందజేసిన బ్యాంకర్లు దాన్ని వినియోగించుకునేందుకు నాలుగు అంకెల పిన నంబర్‌ ఇస్తారు. ఇది ఖాతాదారుడు ఎవరికీ వెల్లడించకూడదు. సాధారణంగా ఖతాదారులు పిన్ నంబర్‌ ఎవరికీ చెప్పరు. కాకుంటే మోసం, అవగాహన లోపం, ఇతరత్రా కారణాల వల్ల పిన్ నంబర్‌ తెలిసిందని అనుమానం వస్తే వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు వారు కార్డు బ్లాక్‌ చేసి కొత్త పిన్ నంబర్‌ను ఎలాట్‌ చేస్తారు. చూడడానికి ఇది పకడ్బందీగానే కనిపిస్తున్నా కూడా, ఏదో రూపంలో పిన్ నంబర్‌ తెలుసుకుంటున్న మోసగాళ్లు తెలివిగా సదరు ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారు.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కా రంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ ‘ఎస్‌బీఐ క్విక్‌’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. స్మార్ట్‌ ఫోన్ ఉన్న వినియోగదారులు ఈ యాప్‌ డౌనలోడ్‌ చేసుకుని తమ ఏటీఎం కార్డును దీంతో కనెక్ట్‌ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇలా వినియోగించుకోవడం వల్ల కార్డు దుర్వినియోగం వందశాతం అరికట్టవచ్చంటున్నారు.
ఖాతాదారులు తమకు డెబిట్‌ కార్డు జారీచేసిన బ్యాంకు శాఖ అధికారులను సంప్రదించి యాప్‌ డౌన్‌‌లోడ్‌ చేసుకుంటున్నట్లు తెలియజేయాలి. వారిచ్చిన సూచనల మేరకు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని ఆప్షన ప్రకారం డెబిట్‌ కార్డు నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. యాప్‌లో మీ నంబర్‌ అప్‌లోడ్‌ అవుతుంది. దీంతో నిరంతరం వినియోగదారుడు మాత్రమే తన కార్డును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మీరు మీ కార్డు వాడకాన్ని లాక్‌ చేయాలనుకుంటే యాప్‌లోకి వెళ్లి ‘ఆఫ్‌’ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఏటీఎంలో కార్డు పెట్టి ట్రాన్సాక్షన్‌కు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు. లావాదేవీలు జరగవు. మళ్లీ మీరు యాప్‌లోకి వెళ్లి ‘ఆన్’ అని ప్రెస్‌ చేసినప్పుడు మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. దీనివల్ల ఇతరులెవరైనా మీ కార్డును చోరీ చేసినా, ఇతరత్రా విధానాల్లో మీ కార్డును దుర్వినియోగం చేయాలని ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు. కార్డు సొంతదారుడు తనకు అవసరమైనప్పుడు ‘ఆన్’లోను, అవసరం లేనప్పుడు రక్షణ కోసం ‘ఆఫ్‌’లోను పెట్టుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. ముఖ్యంగా ఎక్కువ మొత్తం నగదు ఖాతాల్లో కలిగిన వారికి ఈ సదుపాయం ఎంతో రక్షణాత్మకం అనవచ్చు.
షాపింగ్‌ నియంత్రించవచ్చు. సాధారణంగా సైబర్‌ నేరాల్లో రెండు రకాల చోరీలు జరుగుతుంటాయి. ఒకటి మన ఖాతా నుంచి నగదు వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం, లేదా మన కార్డు ఉపయోగించి పెద్ద మొత్తంలో షాపింగ్‌ చేయడం. అందువల్ల పిన్ ఆన్/ఆఫ్‌ సదుపాయం వల్ల ఈ రెండు రకాల చర్యలను నిరోధించవచ్చు. సైబర్‌ నేరగాళ్లకు మన పిన్ నంబర్‌ పొరపాటున తెలిసినా షాపింగ్‌ చేయడంగాని, డబ్బులు వేరే ఖాతాలోకి మరల్చడంగాని చేయలేరు.
ఈ సదుపాయం పొందాలంటే ముఖ్యంగా కావాల్సింది మన ఫోన నంబర్‌ రిజిస్ట్రేషన్. మన ఖాతా ఉన్న బ్యాంక్‌ శాఖలో ఏ ఫోన నంబర్‌ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ ఫోన్ నంబర్‌ ద్వారా మాత్రమే ఈ యాప్‌ను వినియోగించుకోగలం. మన రిజిస్ట్రర్డ్‌ నంబర్‌ నుంచి ఇంగ్లీష్‌లో ఆన్ ఈజీ అని కొట్టి గ్యాప్‌ ఇచ్చి వినియోగదారుడి రిజిస్ట్రర్డ్‌ నంబర్‌ టైప్‌ చేయాలి. అనంతరం దాన్ని 0922348888 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. మన రిజిస్ట్రర్డ్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్ వస్తుంది. అలా రాలేదంటే మనం బ్యాంక్‌లో రిజిస్ట్రేషన్ చేసిన ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలి.
ప్రస్తుతానికి ఈ యాప్‌ను ఎస్‌బీఐ మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరిగి ఖాతాదారులకు ప్రయోజనం కలిగితే మిగిలిన జాతీయ, ప్రైవేటు బ్యాంక్‌లు కూడా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని బ్యాంక్‌లు ఇటువంటి రక్షణాత్మక చర్యలు చేపడితే సైబర్‌ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చు.
ఈ యాప్‌లో పిన్ ఆన్, ఆఫ్‌ సదుపాయమే కాకుండా మరెన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అకౌంట్‌ సర్వీసెస్‌ ద్వారా రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌, ఆరు నెలల స్టేట్‌మెంట్‌, ఎడ్యూలోన్, హోమ్‌లోన్ సర్టిఫికెట్‌ వంటి సదుపాయాలు పొందవచ్చు. అలాగే ఏటీఎం డెబిట్‌ కార్డు ఆప్షనలోకి వెళ్లి కార్డు బ్లాక్‌ చేసుకునే సదుపాయం పొందవచ్చు. కొన్నిసందర్భాల్లో మనం మన ఏటీఎం కార్డు పొగోట్టుకుంటాం. లేదా ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది.
ఇటువంటి సందర్భాల్లో కార్డును బ్లాక్‌ చేసునే సదుపాయం చిన్న ఎస్‌ఎంఎస్‌ ద్వారా మనకు మనమే చేసుకోవచ్చు. ఇందుకోసం బ్లాక్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మన డెబిట్‌ కార్డు చివరి నాలుగు అంకెలు టైప్‌చేసి 09223966666 ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. దీంతో కార్డు బ్లాక్‌ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్డు బ్లాక్‌ అయిన ఆప్షన్ వినియోగిస్తే పర్మినెంట్‌గా కార్డు బ్లాక్‌ అయిపోతుంది. అందువల్ల కొత్త కార్డు తీసుకోవడమే తప్ప కార్డు దొరికినా వినియోగించుకునే సదుపాయం ఉండదు. అందువల్ల కార్డు పోగొట్టుకున్నా, దొంగతనం జరిగినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ వినియోగించాలి

Written by K Ravikumar Kurnool

No comments:

Post a Comment