అతి పెద్ద .... బుల్లి ప్రపంచం
అదొక పెద్ద నగరం .... కోటలు , భవనాలు, కట్టడాలు ఇందులో వింతేమి లేదు కధూ ? కాని అవన్నీ మీ మొకాలంత ఎత్హుల్లో ఉంటె ! అదే మరి ఇక్కడి విచిత్రం !
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ముందు ద్వారక నగరం బుల్లిబుల్లి ఇళ్ళతో కనిపించిన దృశ్యం గుర్తుందా ! పోనీ గలివర్ కధ లో లిల్లిపుట్ నగరం గురించి తెలుసా ? అచ్చం అలాంటి నగరం ఒకటి స్పైన్ దేశంలోని బార్సిలోనాలో ఉంది. అక్కడికి వెళితే మీరే భారికాయుడైపోయిన భావన కలుగుతుంది . ఎందుకంటే అదొక సుక్ష్మ నగరం అన్నమాట . ఇంగ్లిష్లో దీన్ని మినీఎచర్ వరల్డ్ అంటారు.బార్సిలోనాలో ఉంది అదే ,పైగా ఇది ప్రపంచంలో అతి పెద్ద మినీఎచర్ వరల్డ్ గా గుర్తింపు పొదింది .
కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ లు పాటలు పాడుతుంటే నేపధ్యంలో భవనాలే కాదు రైళ్ళు , విమానాలు , ఓడలు కుడా బుల్లి బుల్లి గా కనిపించిన దృశ్యాలు చూసే ఉంటారు . ఆ సన్నివేశాన్ని ఇలాంటి సుక్ష్మ నగరాలలోనే చిత్రికరిన్చారన్నమాట , నిజానికి ఇలాంటి బుజ్జి ప్రపంచాలు ప్రపంచంలో దాదాపు ౩౦ వరకు ఉన్నాయి .అక్కడన్నీ చిన్న చిన్న ఇల్లు , బుజ్జి కట్టడాలు ఉద్యనావనాలే కనిపిస్తాయి , బార్సిలోన దగ్గర కాతలునియా అనే పెద్ద నగరం ఉంది . ఆ నగరం సుక్ష్మ నమూనానె అక్కడ మినీఎచర్ పార్క్ లాగ రూపొందించారు , నగరం లో అన్ని ముఖ్యమైన కట్టడాలతో పాటు, ఆ దేశంలోని ప్రసిద్ధ భావనలు, కోటలు కుడా అక్కడ 25 రెట్లు చిన్నవిగా కనివిందు చేస్తాయి , ప్రతి కట్టడం తాలుకు నిర్మాణ పటాలను బట్టి అత్యంత జాగ్రతలతో సుక్ష్మంగా తిర్చిదిదారు , ఇది కళాకారులు చేసిన కనికట్టులా అనిపిస్తుంది , మోత్హం 150 కి పైగా బుజ్జి కట్టడాలు దీంట్లో ఉన్నాయి . 1983 లో ప్రారంభించిన ఇది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది .
ఇలాంటి సుక్ష్మ ప్రపంచాల్లో మరొక ప్రసిద్ధమైనది ఇంగ్లాండ్ లోని టర్కీ లో ఉంది , ఇప్పుడక్కడ ఓ చలికాలం పండగ కుడా జరుగుతుంది. నాలుగు ఎకరాల స్థలం లో ఉన్న దీంట్లో మొత్తం 400 కు పైగా బుల్లి కట్టడాలున్నాయి. అతి ఎక్కువ కట్టడాలున్న మినిఎచార్ పార్కుగా దీనికి రికార్డు ఉంది , ఇందులో వీధులు , వీధి దీపాలు , ఆట మైదానాలు , బస్సులు ,రైళ్ళు , విమానాలు , ఆఖరికి నదులు , జలపాతాలు , వంతెనలు సైతం బుల్లి బుల్లి గ కనిపించి అలరిస్తాయి . పైగా అవన్నీ కృతిమంగా కురిపించే మంచుతో నిండిపోయి ఆకట్టుకుంటాయి . దిన్ని చూడడానికి దేశదేశాలు నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తారు . మరి ఇంత చిన్న కట్టడాలున్న పార్కుల్లో మనుషులేలా నడుస్తారు ? పర్యాటకులు నడవాడానికి ప్రత్యేకంగా పెద్ద రోడ్లు ఉంటాయి . పైగా అందరిని అలరించే బోలెడు ఆకర్షణlu
Follow us for more interesting info
Written by|K Ravi kumar|Kurnool

No comments:
Post a Comment