Paid2YouTube.com

Monday, 2 January 2017

మీ జీన్స్ తో ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేశారా?

కొత్త కొత్త ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా.. జీన్స్ కి ఉన్నంత క్రేజ్ వేరే దేనికి ఉండదు. అసలు ఈ కాలంలో జీన్స్ లేకుండా ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా యూత్ ధరించే దుస్తులలో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఇందులు ప్రతీ ఒక్కరికి ఫేవరెట్ జీన్స్ కూడా ఉంటుంది. దుమ్ము పడకుండా, మరకలు అంటకుండా... వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయినాగాని కొన్ని సార్లు త్వరగా పాడైపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలన్నా... మీ ఫేవరెట్ జీన్స్ ఎక్కువ కాలం మన్నాలన్నా... ఇప్పుడు మేము చెప్పబోయే ఈ సింపుల్ ట్రిక్ పాటించండి..!! ఇవి పాటిస్తే... సాధారణ జీన్స్ అయినా లేక బ్రాండెడ్ జీన్స్ అయినా.. ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండడం ఖాయం..!!

* జీన్స్ కొత్తగా ఉండాలని పదే పదే ఉతికితే ఫాబ్రిక్ తొందరగా పాడైపోతుంది. అంతేకాక జీన్స్ రంగు ఫేడ్ అయ్యిపోయి చిరిగిపోవటమే కాక చాలా పాతదిగా కన్పిస్తుంది.

* సరైన మరియు మంచి డిటర్జెంట్ వాడాలని గుర్తుంచుకోవాలి. ఫాబ్రిక్ గట్టిగా ఉంటుందని చాలా మంది వేడి వేడి నీటిలో నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. ఇలా చేస్తే మీ జీన్స్ త్వరగా పాతగా మారిపోతుంది.

* జీన్స్ ఉతికేటప్పుడు రంగు పోతుంటే జీన్స్ ని తిరగవేసి ఉతకటం మంచిది. ఈ ట్రిక్ పాటిస్తే జీన్స్ రంగు పోకుండా కొత్తవాటిలా మెరుతస్తాయి.

* ఈ కాలం లో షేప్ అప్ జీన్స్ ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి జీన్స్ వాడుతారు. ఇలాంటి జీన్స్ వాష్ చేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే వాటి షేప్స్ మారిపోతుంటాయి. వీటి క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే జిప్ క్లోజ్ చేసి, బటన్ పెట్టి వాష్ చేయాలి.

* జీన్స్ ఉతికేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయం పాకెట్స్ చెక్ చేయడం. ముఖ్యంగా వాషింగ్ మెషిన్ లో వేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. పాకెట్స్ లో కాయిన్స్ ఉంటె జీన్స్ చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి.

* ఎట్టి పరిస్థితుల్లో జీన్స్ ని బ్లీచ్ వాష్ చేయకూడదు. బ్లీచ్ వల్ల జీన్స్ కలర్ కోల్పోడమే కాకుండా ఫ్యాబ్రిక్ పలచబడిపోయి.... త్వరగా పాతబడి చిరిగిపోతాయి. అసలు చెప్పాలంటే బ్లీచ్ అనేది జీన్స్ కి బద్ధశత్రువు.

* జీన్స్ కి మరో శత్రువు సన్ లైట్. సాధారణంగా జీన్స్ ఉతకగానే త్వరగా ఆరిపోవాలని సన్ లైట్ లో ఆరేస్తారు. కాని సన్ లైట్ వల్ల జీన్స్ షేప్ మారిపోతుంది. అలాగే కలర్ కూడా త్వరగా మారిపోతుంది. వీలైనంత వరకు నీడలో ఆరెయ్యాలి. కుదిరితే ఇంట్లోనే ఆరబెట్టడం మంచిది.

Written by K Ravikumar kurnool

No comments:

Post a Comment