Paid2YouTube.com

Monday, 2 January 2017

ఈ ట్రిక్స్ తో వాట్సాప్ లో అమ్మాయిలని ఇంప్రెస్ చేయండి?



ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా కొన్ని పనులు జరగడం కొద్దిగా కష్టమవుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ వాడే వారు ఫేస్ బుక్, వాట్సాప్, యుట్యుబ్ లాంటివి నిత్యం వాడుతూనే ఉంటారు. వీటిలో మెసేజింగ్‌ కొరకు అత్యధికంగా వాడేది వాట్సాప్. కామన్ మ్యాన్ దగ్గరనుండి రాజకీయ నేతల వరకు అందురు దీన్ని వాడుతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం రోజు ఈ యాప్ ను వాడుతున్నా.... అందులో మనకు తెలియని ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. వీటిని కొందరు చాలా తెలివిగా మెరుగులు దిద్ది మరి పంపిస్తుంటారు. అలా ఎలా చేశారు అనే సందేహం వచ్చి ఉండచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

* మీరు పంపించిన మెసేజ్ కు టిక్ మార్క్ రాకపోతే, మీ దగ్గర నుండి మెసేజ్ వెళ్ళలేదు అని అర్ధం. ఒకవేళ గ్రే కలర్ టిక్ ఒక్కటి వచ్చిందంటే, మీ దగ్గర నుండి వెళ్ళింది కాని ఇంకా డెలివర్ కాలేదు అని.... రెండు గ్రే టిక్కులు వస్తే మెసేజ్ డెలివర్ అయ్యింది కాని ఎదుటి వారు ఇంకా చదవలేదు అని.... రెండు బ్లూ కలర్ టిక్కులు వస్తే వారు చదివారని అర్ధం.

* ఎవరైనా మెసేజ్ పంపించినప్పుడు, వారి మెసేజ్ చదివాము అని తెలిస్తే చాట్ చేయడం ప్రారంభిస్తారు. అలా కాకుండా ఉండాలంటే... మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీ ఫోన్ ను ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి మెసేజ్ ను చదవాలి. అప్పుడు మీరు ఆ మెసేజ్ ను చదివినట్టు అవతలవారికి తెలియకుండా ఉంటుంది. మెసేజ్ చదివిన తరువాత వాట్సాప్ నుండి బయటకు వచ్చేసి తిరిగి నార్మల్ మోడ్ లోకి వచ్చేయచ్చు.

* మనం పంపిన మెసేజ్‌ ఎదుటి వారు ఎప్పుడు చదివారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ మెసేజ్‌ పైన లాంగ్‌ ప్రెస్‌ చేస్తే ఒక మెనూ వస్తుంది, దాంట్లో ఇన్ఫో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు. మీరు పంపిన మెసేజ్ టైం తో సహా వివరాలన్నీ తెలిసిపోతాయి. ఈ ఆప్షన్ కేవలం కొత్త వెర్షన్ లోనే ఉంది.

* అనవసరమైన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా గ్రూప్ ల నుండి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. దీని వల్ల మన ఫోన్ లోని ఇంటర్నెట్ బ్యాలన్స్ తో పాటు, ఫోన్ లోని స్పేస్ కూడా నిండిపోతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి.... చాట్ ఆప్షన్స్ లోకి వెళ్లి... - ఆటోమేటిక్ సేవ్‌ ఇన్‌కమింగ్‌ మీడియా- ను ఆఫ్ చేస్తే చాలు.

* అందరూ పంపించే మెసేజ్ లాగా మనం కూడా సాధారనంగా పంపిస్తే మజా ఏముంది చెప్పండి. అందుకే మీ మెసేజ్ కు కొన్ని మెరుగులు దిద్ది పంపీయండి. మీ మెసేజ్ లో ఏదైనా పదాన్ని హైలైట్ చేయాలనుకుంటే... ఆ పదానికి ఇరు వైపులా స్టార్ మార్క్ ను (*) చేర్చండి eg: *India* - India. ఇలా చేస్తే ఆ పదం బోల్డ్ అవుతుంది. అలాగే అండర్ స్కోర్ (_) చేరిస్తే ఆ పదం ఇటాలిక్ గా మారిపోతుంది eg: _India_ - India. ఏదైనా పదాన్ని కొట్టేయాలి అనుకుంటే... నెగేషన్‌(~) వాడండి eg: ~India~ - India.

* గ్రూప్ మెసేజ్ లను మ్యూట్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రూప్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే పైన మ్యూట్ ఆప్షన్ వస్తుంది.... అందులో ఎంతసేపటి వరకు ఆ గ్రూప్ ను మ్యూట్ చేయాలో అనే ఆప్షన్ కూడా ఉంటుంది.

* మీ తరుచుగా మాట్లాడే ఫ్రెండ్స్, కొలీగ్స్, కుటుంబసభ్యులు, గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లను చాట్ లిస్టులో ఎతకడం కష్టమైతే.... వారి చాట్ మీ హోం స్క్రీన్ పై షార్ట్ కట్ లా పెట్టుకోవచ్చు. ఎవరికైతే షార్ట్ కట్ క్రియేట్ చేయాలో.... వారి చాట్ పై క్లిక్ చేస్తే మెనూ వస్తుంది.... అందులో మోర్ లోకి వెళ్తే అక్కడ షార్ట్ కట్ ఆప్షన్ ఉంటుంది.

* ఇదివరకు ఆడియో, వీడియో ఫైల్స్ మాత్రమే పంపించగలిగే వారు. కాని ఇప్పుడు ఏవైనా పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా పంపవచ్చు. అటాచ్ మెంట్ ఆప్షన్ లో కొత్తగా డాక్యుమెంట్స్ పంపించే ఆప్షన్ కూడా వచ్చింది.

* మెసేజెస్ కన్నా వాట్సాప్ కాల్స్ కు ఎక్కువ డేటా కర్చవుతుంది. ఇప్పటివరకు మెసేజెస్ కి, కాల్స్ కి ఎంత డేటా వాడారో సెట్టింగ్స్ లో డేటా యూసేజ్ ఆప్షన్ లో నెట్వర్క్ డేటా ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.

* పెద్ద లవ్ సింబల్ పంపించే ఆప్షన్ వాట్సాప్ లో ఉందని చాలా మందికి తెలియదు. వాట్సాప్ లోని ఏమోజిలను తరచుగా వాడుతుంటారు అందరు. ఇందులో రెడ్ కలర్ లవ్/హార్ట్ సింబల్ పంపిస్తే అది పెద్దగా మారి గుండె కొట్టుకుంటున్నట్టు ఇతరులకు చేరుతుంది. కాకపోతే ఇదొక్కటే పంపించాలి. దీనికి తోడుగా ఇంకో ఏమోజి ఉంటె పని చేయదు.

Written by K Ravikumar kurnool

No comments:

Post a Comment