Paid2YouTube.com

Sunday, 8 January 2017

మూడుకోట్ల ఏకాదశులతో సమానమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇలాచేస్తే విష్ణుమూర్తి కటాక్షాలు!!



ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనున్మాసం.. ఈ నెలలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని చెబుతారు. ఈ దివ్యమైన రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా లక్ష్మీనారాయణుడు యోగ నిద్ర నుండి మేల్కొని వైకుంఠానికి చేరుకుంటాడు. ఆ శ్రీ మహా విష్ణువుకి వైకుంఠం ఉత్తర దిక్కున నిలిచి మూడు కోట్ల దేవాది దేవతలు జయ జయ ధ్వానాలతో శుభ స్వాగతం చెప్పారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతారు. ఈ పర్వదినాన అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్న వారికి వైకుంఠాన్ని సందర్శించిన ఫలం దక్కుతుంది. ఇంకా పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలంటే..

ఈ వైకుంట ఏకాదశి రోజు ఇలా చేస్తే పుణ్య ఫలం:
* ఈ ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చెయ్యాలి. గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి.
* విష్ణుమూర్తి లేదా విష్ణు రూపాలైన వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, లక్ష్మినృసింహుడు ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంటే సందర్శించాలి. లేకుంటే ఇంట్లోనే పూజించాలి.
* శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తులసి దళం సమర్పిస్తే ఎంతో శుభప్రదం.
* విష్ణువుకి తెల్ల జాజి పువ్వులంటే చాలా ఇష్టం అయితే జాజి పువ్వుల మాలా ఆయనకి ఈ రోజు వెయ్యాలి.
* ఈ రోజు తెల్లని పాయసం లేదా ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యంగా పెట్టాలి.
ఈ మంత్రాలని పటించాలి 
గోవింద నామాలని పటించాలి లేదా “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి లేకపోతే “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించాలి.

No comments:

Post a Comment