Paid2YouTube.com

Saturday, 7 January 2017

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు..! సోపు నీళ్లలో ముంచి చంపివేశారు

బాగ్దాద్‌ : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఇరాక్‌లో తమ ఆధీనంలో ఉన్న మోసుల్‌ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సమాచారం చేరవేసాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని సోపు నీళ్లలో ముంచి చంపివేశారు. వందలాది ప్రజలు చూస్తుండగా నిందితుడిని సోపు నీళ్లతో నిండిన ఈత కొలనులో ముంచివేశారు. గతంలోనూ కొందర్ని అనుమానంతో ఇలాగే చంపివేసిన విషయాలు తెలిసిందే. బతికిఉండగానే మంటల్లో వేసేయడం, భవంతులపై నుంచి తోసివేయడం, శిలువ వేయడం...తదితర ఉన్మాద చర్యలతో సామాన్యులను భయోత్పాతానికి గురిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17న ఇరాకీ ప్రభుత్వ దళాలు, కుర్దు దళాలు అమెరికా వాయుసేన సహకారంతో మోసుల్‌ విముక్తికి పోరాటం ప్రారంభించాయి. ఇప్పటికే మోసుల్‌లోని పలు ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఐఎస్‌ ప్రాబల్యం కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని ఐఎస్‌ను తుదముట్టిస్తామని ఇరాకీ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment