
సాధారణంగా ఇళ్లు కట్టుకోడానికి పది లక్షలు అవుతాయనుకుంటే కనీసం చేతిలో నాలుగు లక్షలైనా ఉండాలి. మిగిలిన ఆరు లక్షల రూపాయలకు లోన్ తీసుకోవచ్చు. 9 శాతం వడ్డీరేటు ప్రకారం ఈఎంఐ 6,085 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీపై గరిష్ఠంగా 2 లక్షల 20 వేలు సబ్సిడీ ఇస్తుంది.
ఉదాహరణకు.. మీరు రూ.6 లక్షల రుణం తీసుకొంటే… సబ్సిడీ మొత్తాన్ని మినహాయించగా మిగిలిన 3 లక్షల 80 వేలకు బ్యాంకు నిబంధనల ప్రకారం నెలవారి వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈఎంఐ దాదాపుగా 2వేల రూపాయల వరకు తగ్గుతుంది. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద రుణం పొందవచ్చు.
చేతిలో నాలుగు లక్షలు లేవు. కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి. కాని, నిర్మాణానికి పది లక్షలు కావాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి.
అవసరమైతే బ్యాంకులు 8 లక్షల రుణం ఇస్తాయి. కేంద్రం ఇచ్చే వడ్డీ సబ్సిడీ మాత్రం రూ.6 లక్షల వరకు వర్తిస్తుంది. మిగిలిన 2 లక్షలకు సాధారణ గృహరుణ వడ్డీని లెక్కకడతారు.
మీరు 10 లక్షలు రుణం తీసుకుంటే 6 లక్షలకు వడ్డీ సబ్సిడీ.. మిగిలిన రూ.4 లక్షలకు సాధారణ గృహరుణ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఈఎంఐ 10వేల రూపాయలకు బదులు.. సబ్సిడీ రాయితీ పోను 8వేల పైచిలుకు చెల్లిస్తే చాలు. సో, దగ్గర్లోని బ్యాంక్‌కు వెళ్లి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకోండి.
ఇ క్రింది వెబ్సైటు ద్వార అప్లై చేసుకోవచ్చువెబ్సైటు కి వెళ్ళినాక Step 1
వెబ్సైటు కి వెళ్ళినాక Step 2
వెబ్సైటు కి వెళ్ళినాక step 3
చాల మందికితెలియని విషయము అందరికి షేర్ చెయ్యండి
Written by K Ravikumar kurnool
No comments:
Post a Comment