Paid2YouTube.com

Tuesday, 17 January 2017

విద్యార్ధి ఏ కాలేజీకైనా మారిపోవచ్చు

విద్యార్ధులు ప్రస్తుతం చదువుతున్న కాలేజీ నుంచి తమకు ఇష్టం ఉన్న కాలేజీకి మారవచ్చని తెలిపింది ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏఐసీటీఈ). ఇందుకోసం ఆ కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధికి తప్పని సరిగా సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలిపింది. అంతే కాదు కోర్సుకు సంబంధించిన పూర్తి ఫీజు కూడా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ తో సహా సాంకేతిక విద్యను అందిస్తున్న కాలేజీలకు అనుమతులు జారీ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పెట్టారు. కోర్స్ పూర్తి కాకముందే మానేసి వెళ్తున్న విద్యార్థులనుంచి కాలేజీల యాజమాన్యాలు అన్ని సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజు చెల్లించకుంటే అసలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. దీనిపై దేశవ్యాప్తంగా భారీగా ఫిర్యాదులు అందటంతో ఈసారి ఏఐసీటీఈ. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్ధి వెళ్లిపోతే…యాజమాన్య కోటా కింద ప్రవేశాలు పొందిన వారితో ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్  ను అతిక్రమిస్తే కాలేజీ సీట్లపై కోత విధించడంతో పాటు కఠిన చర్యలు తప్పవంది.
రాష్ట్రంలోని విద్యార్థులనుంచి  ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో ఏఐసీటీఈ తెచ్చిన కొత్త నిబంధనపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంబంధిత కాలేజీ యాజమాన్యాలకు లేఖలు కూడా రాయనుంది.

No comments:

Post a Comment