Paid2YouTube.com

Tuesday, 13 December 2016

బోగీలో గొలుసు లాగితే రైలు ఎలా ఆగుతుంది?



రైలు పెట్టెల  చక్రాలకు గాలి బ్రేకులు ఉంటాయి.ఈ బ్రేకుల వ్యవస్థలో గాలి ఒత్తిడి ఎకువగా ఉంటుంది. ఈ స్థితిలో బ్రేకులు చక్రానికి  దూరంగా ఉండే ఏర్పాటు ఉంటుంది. బ్రేకులను సందానిచుకొని గాలి సిలిండర్స్  ఉంటాయి.వీటిలో గాలి పిడనాన్ని లేదా ఒత్తిడిని  తగ్గించడం లేదా పెంచడం సాధ్యమైయ్యే వ్యవస్థ ఉంటుంది.గాలి ఒత్తిడిని తగ్గినపుడు బ్రేకుల స్ప్రింగులు చటుక్కున బిగుసుకుని చక్రాన్ని పట్టుకొని ఘర్షణ కలిగిస్తాయి. తద్వారా రైలు ఆగిపోతుంది.మమూలుగా బొగిల చక్రాలకుండే బ్రేకులను అధిక పిదనంతో  ఉండే వాయుగోట్టాలకు అనుసంధానిస్తారు . ప్రతి బోగి లోని వాయుగోట్టాలను బొగిల మధ్య ఉండే కప్లింగ్  బంధం, కవాటాలతోను కలిపి ఉంచుతారు. ఇలా అన్ని చక్రాల బ్రేకుల్ని కలిపే గొట్టాలలోకి అధిక పిడనంతో గాలిని, ఇంజన్   దగ్గరి కంప్రేస్సోర్ సరఫరా చేస్తుంటుంది. ఎవరైనా బోగీలో చైనును లాగినపుడు ఆ బోగి దగ్గర ఉన్న కవాటం తెరుచుకొని గాలి లికైపోతుంది. అంటే గొట్టాలలో పీడనం తగ్గిపోతుంది. వెంటనే బ్రేకులు పడిపోతాయి.అదే సమయంలో విద్యుత్ వలయం ఏర్పడి రైలు ఆగిపోయే వ్యవస్థ కూడా ఉంటుంది.
Follow us for more info

No comments:

Post a Comment