Paid2YouTube.com

Tuesday, 28 February 2017

లోకేష్‌కు దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న వేసిన అమ్మాయి

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కు ఓ లేడీ స్టూడెంట్ దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న వేయ‌డంతో లోకేష్‌తో పాటు అక్క‌డున్న‌వారంతా ఒక్క‌సారిగా అవాక్కైపోయారు. శుక్ర‌వారం గుంటూరు జిల్లాలోని గుంటూరు న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న లాంలోని చలపతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు లోకేష్ అవాక్కయ్యారు. భువనేశ్వరి.. బ్రాహ్మణి వ్యాపారం చేసి సంపాదిస్తుంటే.. మీరు ఖర్చు పెడుతున్నారా? అని ఓ విద్యార్థిని లోకేష్‌ను ప్రశ్నించింది. దీంతో ఒక్క‌సారిగా స్ట‌న్ అయిన లోకేష్ తేరుకుని ఆమె ప్ర‌శ్న‌కు త‌న‌దైన స్టైల్లో ఆన్స‌ర్ ఇచ్చారు.
తాను కూడా హెరిటేజ్‌లో ఐదు సంవ‌త్స‌రాల పాటు ప‌ని చేశాన‌ని.. బ్రహ్మిణి వచ్చాక ఆమెకు కంపెనీ పగ్గాలు అప్పజెప్పి తాను రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అయినా ఇదేమీ తమకు కొత్త కాదని.. ‘తొలినుంచి నాకు…మా నాన్నకు ఖర్చులకు మా అమ్మే డబ్బులు ఇస్తుంది’ అని వివరణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరు కూడా బాగా చదవాలని, వేరే వారికి డబ్బులు ఇచ్చే స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు.

No comments:

Post a Comment