Paid2YouTube.com

Thursday, 12 January 2017

రిలయన్స్ జియో మరో సంచలనం!

ముంబై:  ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్  మరో సంచలనానికి రడీ అవుతోంది.  ఉచిత డాటా, ఉచిత కాల్స్  టారిఫ్  ప్లాన్ లతో   టెలికం రంగంలో  దూసుకొచ్చిన   జియో..  స్మార్ట్ ఫోన్ మార్కెట్  విచ్ఛిన్నానికి సిద్ధమవుతోంది. తక్కువ ధరకే  4జీ వాయిస్  ఎల్ టీఈ ఫీచర్  ఫోన్లతో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు  షాకివ్వనుంది.  రెండు 4 జీ వాయిస్  ఎల్ టీఈ  స్మార్ట్ ఫోన్లను  ప్రారంభించటానికి యోచిస్తోంది. రూ 999 నుంచి  రూ.1,500 ధరల మధ్య వీటిని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం 4 జీ  ఎల్ టీఈ  స్మార్ట్  ఫోన్లు రూ.3,500-రూ. 4,000  మధ్య అందుబాటులో ఉండడం విశేషం.

2017  మొదటి  త్రైమాసికంలో రూ 999 నుంచి రూ. 1,500 స్మార్ట్ ఫోన్లను  ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ ద్వారా విడుదల చేయనున్నారని విశ్లేషకులు  తెలిపారు.  జియో  ఉచిత సేవలతో పాటుముందు, వెనుక కెమెరాలు,  అనేక  యాప్ లు  ఫోన్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. జియో చాట్, లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్ లాంటి యాప్ లతో  ఫోన్ లవర్స్  ను ఆకట్టుకోనుందని  అంచనా వేస్తున్నారు. అలాగే  జియో మనీ, జియో మనీ  వాలెట్ లాంటి డిజిటల్ వాలెట్ సర్వీసులను ఈ మొబైల్స్ లో జోడించవచ్చని తెలిపారు. దీంతో  ఇతర స్మార్ట్ ఫోన్  కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తప్పక పోవచ్చంటున్నారు.
కాగా  పెద్దనోట్ల రద్దు కారణంగా 2017 మొదటి  త్రైమాసికం ఆదాయంలో 40శాతం  క్షీణత నమోదు చేయవచ్చని ఎనలిస్టుల అంచనా. అయితే  భవిష్యత్తులో పుంజుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్  ద్వారా ఉచిత కాల్స్, డేటా, మరియు ఇతర సేవలు అందిస్తోంది. మార్చి 31, 2017తో ఈ ఆఫర్ ముగియనున్న ముసంగతి తెలిసిందే.  అయితే ఈ గడువు లోపే రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లను  అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్  చేస్తోందట.

No comments:

Post a Comment