Paid2YouTube.com

Thursday, 19 January 2017

పవన్ కళ్యాణ్ కోసం ఎన్టీఆర్ సినిమాని వదిలేసాడు!



'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా ఫిబ్రవరి 11న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందట. ఇదిలా ఉంటే....

'జై లవ కశ' టైటిల్ ని నందమూరి కళ్యాణ్ రామ్ తన బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రిజిస్టర్ చేయించాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్తలు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రంలోని మూడు పాత్రల పేర్లు జై, లవ, కుశ అయ్యంటుందని, అందుకే 'జై లవ కుశ' టైటిల్ ని రిజిస్టర్ చేయించారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం కొలవెరి బోయ్ అనిరుధ్ రవిచంద్రన్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారట. కానీ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి కన్ ఫార్మ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని అంగీకరించిన నేపధ్యంలో మరో పెద్ద ప్రాజెక్ట్ కి వర్క్ చేయడానికి అనిరుధ్ సుముఖంగాలేడట. అందుకే ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ని ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. పి.కె, 3 ఇడియట్స్ చిత్రాలకు కెమెరామ్యాన్ గా వ్యవహరించిన సి.కె.మురళీధరన్ ని ఈ సినిమా కోసం కెమెరామ్యాన్ గా తీసుకున్నారు,. ఈ సినిమాని ఆగస్ట్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట

No comments:

Post a Comment