న్యూఢిల్లీ : కొన్ని విషయాలను చూసి ఆనందించాలి కానీ, ఆచరించాలని ప్రయత్నించకూడదు. నిపుణుల పర్యవేక్షణలో సమగ్ర శిక్షణ పొందినవారే చేయగలిగే పనులు ఉంటాయి. ఈ సాహస కృత్యం కూడా అలాంటిదే. దీనిని ఇష్టానుసారం ఆచరించేందుకు ప్రయత్నించకూడదు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో ఒళ్ళుగగుర్పొడుస్తుంది.
ఈ వీడియోలో ఓ యువకుడు తన మెడను ఒకేసారి 180 డిగ్రీలు తిప్పినట్లు కనిపిస్తోంది. మెడను తిప్పేటపుడు మిగతా శరీరాన్ని కదపకపోవడం విచిత్రం. కొందరు వ్యక్తుల సమక్షంలో ఈ విన్యాసాన్ని చేశాడు. అక్కడున్నవారంతా ఇతని నైపుణ్యాన్ని మెచ్చుకుని, చప్పట్లతో అభినందించారు. ఈ స్టంట్ ఎక్కడ జరిగిందో తెలియదు.
No comments:
Post a Comment