Paid2YouTube.com

Friday, 20 January 2017

బియ్యం నీరు.. ఎంతో మేలు..


బియ్యం కడిగిన నీటితో అనేక లాభాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందానికి.. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు.
-బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల బాధ తగ్గుతుంది.
-ముఖారవిందాన్ని పెంచుతుంది.
-ఈనీటిలో దూదిని ముంచి ముఖంపై ఐప్లె చేయడం వల్ల ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది.
-బియ్యం కడిగిన నీటిలో జుట్టుకు మేలు చేసే విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
-జుట్టు పొడవుగా.. ఒత్తుగా పెరిగేందుకు ఈ నీరు ఎంతో
ఉపయోగపడుతుంది.
-చైనాలోని యావో తెగకు చెందిన మహిళ జుట్టు ఏడు నుంచి 10 అడుగుల వరకూ పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం.. వారంతా బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకు బాగా రాసుకొని ఒక గంట తర్వాత తల స్నానం చేస్తారట. అందుకే వీరి జుట్టు బాగా ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతోందని అరోగ్య నిపుణులు అంటున్నారు.
-ఇప్పటికీ కొందరు బియ్యం కడిగిన నీటితో జావ కాచుకొని తాగేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. 

No comments:

Post a Comment