ప్రగ్యా జైస్వాల్భా రతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించారు.
వ్యక్తిగత జీవితం
జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మిచంది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది. కళ మరియు సంస్కృతిరంగంలో ఆమె సాధించిన విజయానికిగాను 2014, జనవరి 22న కోసం సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం అందుకుంది.
సినిమా జీవితం
హిందీ చిత్రమైన టిటూ ఎంబీఏ తో సినిమాల్లోకి వచ్చిన జైస్వాల్, 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇచ్చింది. అయితే, ఆసినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. క్రిష్ తరువాతి చిత్రమైన కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.
డోవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, FBB (బిగ్ బజార్ వద్ద ఫ్యాషన్), డాబర్ వాటిక యాంటీ చుండ్రు షాంపూ, దుబాయ్ మరియు UAE కోసం మిలీనియం, హైపెర్ మార్కెట్, హెల్త్ డ్రింక్ మరియు మలబార్ గోల్డ్ మొదలైన సంస్థలకు బ్రాండ్ అంబాడిజర్ గా చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది.
No comments:
Post a Comment