Paid2YouTube.com

Tuesday, 13 December 2016

ధృవ టెస్టింగ్ టైమ్ స్టార్ట్స్ నౌ

       Written by |k Ravikumar|kurnool

 హానీమూన్ డేస్ పూర్తయ్యాయి. ఇక అసలు సిసలు కాపురం ఈ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఓవర్ సీస్, శాటిలైట్ హక్కుల సంగతి అలా వుంచితే, ఈ సినిమాకు ఖర్చులు కాకుండా 45 కోట్లు రికవరీ కావాల్సి వుంది. ఇప్పటికి తొలి నాలుగు రోజులకు గాను 25 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక కర్ణాటక, తమిళనాడు, అదర్స్ కలుపుకోవాలి. అంటే మూడు రోజుల కన్నా నాలుగో రోజు సహజంగానే డ్రాప్ కనిపించింది.

అయిదో రోజయిన మంగళవారం నుంచి ఎలా వుంటాయో కలెక్షన్లు చూడాలి. రాబోయే వీకెండ్ తో కలిపి మరో పెద్ద సినిమా రావడానికి ఇంకా పది రోజులు సమయం వుంది. ఈ లోగా ఇరవై కోట్లు కనీసం రికవరీ కావాలి. విశాఖ 5.25కు అమ్మారు. ఇప్పుటికి మూడు ముఫై వరకు వచ్చింది. ఇంకా ఖర్చులు కాకుండా రెండు కోట్లు రావాల్సి వుంది.

 నెల్లూరు 2.10 కి ఇచ్చారు. ఇప్పటికి 80 లక్షల వరకు వచ్చింది. ఇంకా కోటి ఇరవై లక్షలు అసలే రావాలి. నైజాం ఏరియా అమ్మలేదు. గీతానే పంపిణీ చేసింది. కానీ నైజాంలో పెద్ద సినిమాలన్నీ 14 నుంచి 16 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ధృవ ఇప్పటికి దగ్గర దగ్గర 9 కోట్లు బిజినెస్ చేసింది. ఆ రేషియోలో చూసుకుంటే ఇంకా ఆరేడు కోట్ల వరకు రావాలి.

 సీడేడ్ ఏ పెద్ద సినిమా అయినా ఏడు నుంచి తొమ్మిది కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూడా నేరుగా విడుదల చేసుకున్నారు. ఇక్కడ ఇప్పటికి నాలుగు కోట్లకు పైగా వచ్చింది. మరో అంత రావాలి. గుంటూరు కూడా అంతే సగానికి సగం వచ్చింది ఇప్పటికి.

నిజానికి రామ్ చరణ్ ఈ సినిమా విడుదలకు ముందుగానే యుఎస్ వెళ్లిపోవడం అన్నది ఓ మైనస్. ఇప్పుడు ఆయన తిరిగి వస్తున్నారు. బహుశా గురువారం నుంచి ప్రమోషన్ ఏక్టివిటీస్ పుంజుకునే అవకాశం వుంది.

 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బుధవారం నుంచి ప్రచార రంగంలోకి దిగుతోంది. ఇక్కడి నుంచి ప్రచారం పికప్ చేస్తే, వచ్చే వీకెండ్ వరకు స్టడీగా కలెక్షన్లు వుంటే మిగిలిన పది రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశం వుంది. ఏమాత్రం ప్రచారాన్ని పట్టు జార్చేసినా కష్టం అయిపోతుంది.

రామ్ చరణ్ లాంటి హై ఫై హీరోలంతా పబ్లిసిటీ అంటే ట్విట్టర్, సొషల్ నెట్ వర్క్ అనుకుంటున్నారు. అక్కడ ట్వీట్ లు చూసి హ్యాపీ అయిపోతున్నారు. కానీ మన సినిమాలకు మహరాజ పోషకులు బి సి సెంటర్లలోనే వున్నారు. వాళ్లను టార్గెట్ చేసి చేయాలి ఏ ప్రచారం అయినా.
Follow usFor more information

                             

No comments:

Post a Comment