Paid2YouTube.com

Saturday, 14 January 2017

అద్భుతమైన ఆఫర్ ప్రకటించిన టెలినార్......!

రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం కంపెనీలు ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతున్నాయి. ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్‌ఎన్ఎల్ వంటి కంపెనీలు ఇచ్చిన అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌నే టెలినార్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు టెలినార్ సిగ్నల్ వైజ్‌గా ఎక్కువ మందికి పెద్దగా పరిచయం కాలేదు. కాని తాజాగా ఈ కంపెని 4జీ సెగ్మెంట్‌లోకి కూడా అడుగు పెట్టింది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాదు మరికొన్ని ఆకర్షణీయమైన డాటా ప్యాక్‌లతో కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు టెలినార్ రూ. 11తో రిచార్జ్ చేసుకుంటే ఒక రోజంతా అన్‌లిమిటెడ్ 4జీ డేటాను వాడుకోవచ్చు. అది కూడా ఇష్టమైనంత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 239తో రిచార్జ్ చేస్తే 6జీబీ 4జీ డేటా వస్తుంది. దీనితో పాటు కొంత మంది సెలెక్టెడ్ యూజర్లకు 57 రూపాయలకే 28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ 4జీ డేటా ఆఫర్ అందిస్తుంది. అదే రూ. 98తో రీచార్జ్ చేస్తే 2జీబీ డేటా లభిస్తుంది. ఇది 28 రోజులు వర్తిస్తుంది.

No comments:

Post a Comment